Social 1080×1350 • Multi-page
26-03-2025 BREAKING NEWS 10:54 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజలంతా సేంద్రియ ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి..కొత్తపల్లిలో రైతు వారదిని ప్రారంభించిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

ప్రజలంతా సేంద్రియ ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి..కొత్తపల్లిలో రైతు వారదిని ప్రారంభించిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
IMG_20250326_225217

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(కొత్తపల్లి): సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు ఆరోగ్యంతో పాటు పోషకాలను అందిస్తాయని కాంగ్రెస్ నాయకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కొత్తపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు వారది కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

దేశ విదేశాల్లోని ప్రజలందరూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పలు పంటలను వినియోగించాలని సూచించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం సేంద్రియ ఆహారానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ…సేంద్రియ ఆహారం పట్ల విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. సేంద్రీయ ఎరువులను పండించే రైతుల్లో విశ్వాసం నింపుతున్నారని చెప్పారు. ప్రజలందరూ సేంద్రియ ఆహారాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మిల్లెట్స్ చాలా క్రేజ్ ఉందని ఈ మిల్లెట్స్ ద్వారా చాలామందికి రోగ నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా ఆయుష్షును సైతం ప్రభావితం చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టాల్ నిర్వాహకులు మధు, ప్రముఖ సామాజిక కార్యకర్త నాగి శేఖర్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!