Social 1080×1350 • Multi-page
26-03-2025 BREAKING NEWS 11:14 PM
swarnodayam.com
Telugu Daily News

15వ ఆర్థిక సంఘం నిధులకు పొందుటకు హుజురాబాద్ కు అర్హత.. -పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్

15వ ఆర్థిక సంఘం నిధులకు పొందుటకు హుజురాబాద్ కు అర్హత.. -పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్
IMG_20250326_230928

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆస్తిపన్ను వసూలులో 100 శాతం వసూలు చేసిన హుజురాబాద్ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందుటకు అర్హత సాధించిందని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కెoసారపు సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు సిబ్బందితో ప్ల కార్డులు ధరించి హర్షం వ్యక్తం చేశారు. కాగా స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమములో భాగంగా ఇప్పల నర్సింగాపూర్ లోని కంపోస్టు యార్డును కంపోస్టు డెవలప్ మెంట్ అధికారి హేమలత బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తడి పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాలు గురించి తడి చెత్త నుండి ఎరువుల తయారీ విధానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ జి సాంబరాజు కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జె శ్రీకాంత్, ఎండి రషీద్, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు, సిబ్బంది, మెప్మా, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072మున్సిపల్ కార్యాలయం ముందు సిబ్బందితో ప్ల కార్డులు ధరించి హర్షం వ్యక్తం చేస్తున్న కమిషనర్ సమ్మయ్య
Oplus_131072 విజయ సంకేతం చూపుతున్న మున్సిపల్ కమిషనర్, సిబ్బంది..
Oplus_131072
Oplus_131072కంపోస్టు యార్డును పరిశీలిస్తున్న కంపోస్టు డెవలప్ మెంట్ అధికారి హేమలత
Oplus_131072 పరిశుద్ధ సిబ్బందికి సూచనలు చేస్తున్న అధికారిని హేమలత
Oplus_131072

మున్సిపల్ కమిషనర్ కు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలుపుతున్న కలెక్టర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!