Social 1080×1350 • Multi-page
27-03-2025 BREAKING NEWS 06:06 PM
swarnodayam.com
Telugu Daily News

జర్నలిస్టులకు రాయితీ కల్పించి ఆదుకోండి: -ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

జర్నలిస్టులకు రాయితీ కల్పించి ఆదుకోండి: -ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి న్యూఢిల్లీ మార్చి 27: రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరిం చాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారే నని, తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారన్నారు. ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వారిపై ఆర్థిక భారం పడకుండా సాయం చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు.రైలు ప్రయాణాల సందర్భంగా గతంలో మాదిరిగా 50% రాయితీని పున రుద్ధరించాల్సిందిగా పాత్రికేయులు, వారి సంఘాలు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా సమాజానికి తమ విలువైన సేవలందిస్తున్న జర్నలిస్టు లకు రైల్వే టిక్కెట్లలో 50% రాయితీ కల్పించడమనేది సమంజసం, సముచితమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

Oplus_131072 కేంద్ర రైల్వే శాఖ మంత్రి కి వినతి పత్రం అందజేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!