Social 1080×1350 • Multi-page
27-03-2025 BREAKING NEWS 08:10 PM
swarnodayam.com
Telugu Daily News

రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తుంది.. వెంకట్ రాంరెడ్డి, వోడితల ప్రణవ్.

రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తుంది.. వెంకట్ రాంరెడ్డి, వోడితల ప్రణవ్.
IMG-20250327-WA0124

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏ రాజ్యాంగంతో బీజేపీ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చారో, ఆ రాజ్యాంగాన్ని బీజేపీ నాయకులు అవమానపరుస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన హుజురాబాద్ పట్టణ, మండల జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశానికి(వరంగల్) కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్ రాంరెడ్డితో పాటు ఆయన పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏఐసీసీ పిలుపు మేరకు వచ్చే నెల ఏప్రిల్ మూడు నుండి రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పాదయాత్రను నిర్వహించబోతున్నమని, దీంట్లో భాగంగా ప్రతీ కార్యకర్త గడప, గడపకు బీజేపీ చేస్తున్న అరాచకాలను తీసుకువెళ్లాలని కోరారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అవమనపరిచారని, దానికి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆయన్ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి, సొల్లు బాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల అధ్యక్షుడు, ఎన్ఎస్యూఐ నాయకులు, మహిళా సంఘ నాయకురాలు, సోషల్ మీడియా ఇంచార్జిలు, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072

కార్యక్రమంలో మాట్లాడుతున్న కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్ రాంరెడ్డి

Oplus_131072
Oplus_131072

కార్యక్రమంలో మాట్లాడుతున్న వోడితెల ప్రణవ్..

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!