Social 1080×1350 • Multi-page
27-03-2025 BREAKING NEWS 09:12 PM
swarnodayam.com
Telugu Daily News

ఇద్దరు మహిళ దొంగల అరెస్ట్

ఇద్దరు మహిళ దొంగల అరెస్ట్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ లోనీ మంజునాథా జ్యూయలర్స్ లో వెండి ఆభరణాలు దొంగతనం చేసిన ఇద్దరిని గురువారం అరెస్టు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ జి తిరుమల గౌడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల సూపర్ బజార్ లోని మంజునాథ జ్యువెలర్స్ లో ఆభరణాల కొనుగోలు పేరుతో గుర్తుతెలియని ఇద్దరు మహిళలు వెండి పాయలలు (పట్ట గొలుసులు)దొంగిలించారు. వ్యాపారి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాళ్లను గుర్తించి వారి కోసం పోలీసులు గాలిస్తుండగా గురువారం హుజురాబాద్ బస్టాండ్ లో వారిని పట్టుకున్నారని, వారి వద్ద నుండి దొంగిలించిన వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారస్తులు సీసీ కెమెరాలను తమ దుకాణాలలో అమర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎస్‌కే యూనస్ అహ్మద్ అలీ పోలీసులు పాల్గొన్నారు.

Oplus_131072 చోరీ చేస్తున్న మహిళలు (ఫైల్ ఫోటో)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!