28-03-2025 NORMAL NEWS 09:07 AM
swarnodayam.com
Telugu Daily News
28-03-2025 09:07 AM By Mandala Yadagiri

విద్యార్థిని వేధించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి-పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. – బీజేపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి

విద్యార్థిని వేధించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి-పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. – బీజేపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి
IMG_20250328_090257

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చీకురాయి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి అయిన అమర్ నాథ్ అనే విద్యార్థిని హనుమాన్ దీక్ష మాల వేసుకుని పాఠశాలకు వస్తే సదరు పాఠశాల యాజమాన్యం విద్యార్థిని బయట ఎండలోనే నిలుచోబెట్టి, పాఠశాలకు రావద్దని శారీరకంగా, మానసికంగా వేధించిన సెయింట్ అన్స్ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి మాధవి లకు బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రంలు సమర్పించారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జిల్లా విద్యాధికారి మాధవికి ప్రతి పత్రం అందజేస్తున్న జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి

జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న సంజీవరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!