Social 1080×1350 • Multi-page
28-03-2025 BREAKING NEWS 02:45 PM
swarnodayam.com
Telugu Daily News

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు
IMG-20250328-WA0258

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు వారిని కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ చేపట్ఠిన, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రులు పాత్రికేయులకు, ప్రజలకు తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. సమస్యలపై పోరాటంలో తాము జర్నలిస్టుల వెంట కలిసి నడుస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనాలు తమ సందేశాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా, ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మంత్రులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!