28-03-2025 NORMAL NEWS 07:14 PM
swarnodayam.com
Telugu Daily News
28-03-2025 07:14 PM By Mandala Yadagiri

ట్రాన్స్ జెండర్ లను అవమానపరిచిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు తక్షణమే క్షమాపణ చెప్పాలి.. -తెలంగాణ ట్రాన్స్ మాత కమ్యూనిటీ నేతల డిమాండ్.

ట్రాన్స్ జెండర్ లను అవమానపరిచిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు తక్షణమే క్షమాపణ చెప్పాలి.. -తెలంగాణ ట్రాన్స్ మాత కమ్యూనిటీ నేతల డిమాండ్.
IMG-20250328-WA0339

మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ట్రాన్స్ జెండర్ లను శాసనసభలో అవమానపరిచే విధంగా మాట్లాడిన మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ట్రాన్స్ మాత కమ్యూనిటీ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంత్రుల ఫ్లెక్సీలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ లను హక్కును చేర్చుకొని శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ లో ఉద్యోగాలు కల్పించింది అన్నారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాన్స్ జెండర్ లకు ఎలాంటి సహాయం చేయని గత బిఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ మంత్రులు అవమానపరిచినందునా తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్ మాత కమ్యూనిటీ నియోజకవర్గ అధ్యక్షురాలు రోంటాల కుమారి, ఉపాధ్యక్షురాలు హరిత, కోశాధికారి రాజి, హుజురాబాద్ మండల అధ్యక్షురాలు రవళి, నాయకులు సత్య, విజ్జి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిల చిత్రపటంతో నిరసన వ్యక్తం చేస్తున్న ట్రాన్స్ మాత కమ్యూనిటీ నియోజకవర్గం నాయకురాలు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!