Social 1080×1350 • Multi-page
29-03-2025 BREAKING NEWS 08:30 AM
swarnodayam.com
Telugu Daily News

సాంప్రదాయ, ఆధునిక విజ్ఞానాలను మేలవించాలి… -ప్రొఫెసర్ ఆనంద కిషోర్ కోలా

సాంప్రదాయ, ఆధునిక విజ్ఞానాలను మేలవించాలి… -ప్రొఫెసర్ ఆనంద కిషోర్ కోలా
IMG_20250329_082818

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
నేటితరం ప్రాచీన, ఆధునిక విజ్ఞానాల మేళవింపుతో నూతన భారతదేశం ఆవిష్కృతమవుతుందని వరంగల్ ఎన్ఐటి ప్రొఫెసర్ ఆనంద కిషోర్ కోలా అన్నారు. శుక్రవారం హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సాంప్రదాయ విజ్ఞానాన్ని నేర్చుకుంటూనే, ఆధునిక నైపుణ్యాలు అలవర్చుకున్నపుడే వికసిత భారత దేశం ఆవిష్కరించ బడుతుందని అన్నారు. నేను నుండి మనము, మనము నుండి విశ్వం అనే భావన లోకి వెళ్ళినప్పుడు యువ వికసిత భారత్ సాధ్యం అవుతుందని, ఇందుకోసం ప్రాచీన భారత వ్యక్తిత్వ వికాస సూత్రాలు, ఆధునిక పరిస్థితులకు అనువయించినపుడే అది సాధ్య మవుతుంది అని అన్నారు. అనంతరం శ్రీలంక, యునెస్కో చాప్టర్ డైరెక్టర్, డాక్టర్ రీతావ్యాస్ నాగర్, హాంగ్ కాంగ్ సౌత్ఇం డియన్ రీజినల్ చాప్టర్ డైరెక్టర్, ఆడిలైడ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా డాక్టర్ గీతా సింగ్, యూకే కార్గిఫ్ యూనివర్సిటీ, డాక్టర్ వెంకట భక్తవత్సలం, కారైకుడి అలగప్ప యూనివర్సిటీ డాక్టర్ అరుణాచలం లు ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఇందిరాదేవి వ్యక్తిత్వా వికాస నిపుణులు అయితే ప్రకాశం, కళాశాల అధ్యాపకులు డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి డాక్టర్ లింగారెడ్డి, మైపాల్ రెడ్డి ,నరేందర్ రెడ్డి, రేణుక ,ఝాన్సీ రాణి సుమలత, వి.స్వరూపా రాణి ,రమ, స్వప్న, పల్లవి ,శ్రీధర్, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072 మాట్లాడుతున్న ప్రొఫెసర్ ఆనంద కిషోర్ కోలా
Oplus_131072 అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
Oplus_131072 హాజరైన అధ్యాపకులు, అతిధులు, విద్యార్థులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!