Social 1080×1350 • Multi-page
29-03-2025 BREAKING NEWS 01:26 PM
swarnodayam.com
Telugu Daily News

బీజాపూర్- దంతేవాడ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్?.. – 15 మంది మావోయిస్టుల మృతి

బీజాపూర్- దంతేవాడ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్?.. – 15 మంది మావోయిస్టుల మృతి
IMG-20250329-WA0085

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్(చత్తీస్ ఘడ్), మార్చి 29:
చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అడవిలో శనివారం ఉదయం 7 గంటల నుండి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి..

సూక్ష్మ జిల్లా గోగుండ కొండపై ఊపంపల్లి ప్రాంతంలో ఈరోజు ఉదయం నుండి మావోయిస్టులకు భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి ఈ ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది, మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆపరే షన్లో డిఆర్జి సిఆర్పిఎఫ్ జవానులు పాల్గొన్నారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఎదురు కాల్పులు ఇంకా కొనసాగు తున్నట్లు పోలీస్ నిఘా వర్గాల సమాచారం.

కొండపై గంగలూరు పోలీస్ స్టేషన్ ఏరియా (బీజాపూర్) పరిధిలో భద్రతా సిబ్బంది సంయుక్త బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కొనసా గుతోంది దీనికి సంబంధిం చిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. మూడు నెలల్లో 100 మందికి పైగా మావోయిస్టులను హతమార్చిన భద్రతా బలగాలు.


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!