Social 1080×1350 • Multi-page
29-03-2025 BREAKING NEWS 11:35 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యాసంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు

విద్యాసంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు
IMG-20250329-WA0171

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం హుజురాబాద్ పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో ముందస్తు ఉగాది వేడుకలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో పాఠశాలలకు హాజరయ్యారు. పాఠశాలలో ముగ్గులు వేసి అందంగా తయారు చేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉగాది పండుగ విశిష్టతను ప్రాముఖ్యతను వివరించే పలు నాటకాలను ప్రదర్శించారు. ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారో తెలియజేసే నాటకము వేసి పిల్లలందరికీ ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ నుండే సంవత్సరం ప్రారంభమవుతుందని తెలుగులో చైత్రమాసం మొదటి నెలగా పిల్లలకు వివరించారు. జనవరి 1న జరుపుకునే నూతన సంవత్సరం ఇంగ్లీష్ వారిదని మన సాంప్రదాయం ప్రకారం ఉగాది నుండి నూతన సంవత్సరంగా జరుపుకోవాలని వివరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!