30-03-2025 NORMAL NEWS 03:58 PM
swarnodayam.com
Telugu Daily News
30-03-2025 03:58 PM By Mandala Yadagiri

మల్లిఖార్జున స్వామి దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు.. – పాల్గొన్న ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

మల్లిఖార్జున స్వామి దేవాలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఘనంగా  ఉగాది పర్వదిన వేడుకలు.. – పాల్గొన్న ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు
IMG-20250330-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గంగిపల్లి శివారులో నెలకొన్న భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం లో పాలక మండలి ఆధ్వర్యంలోఆలయ పూజారి ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు చిట్యాల సంతోష్ పంచాంగ శ్రవణం పటిస్తూ అందరికీ సర్వ శుభాలు చేకూరాలని అన్నారు. జీవితం సకల అనుభూతుల మిశ్రమమని అదే ఉగాది పచ్చడి తెలియ జెప్పే నిజమన్నారు. మామిడి, వేప చెట్లకు పూత పూసి కోయిల గొంతుక పెకిలి, పసిడి బెల్లం తోడు నిలిచి, గుమ్మానికి పచ్చని తోరణం ఉగాది ఉత్తేజానికి ఆశావహ ఉత్తెజానికి, దృక్పథానికి ప్రతీక అని, ఆకులు రాలిన చెట్ల వలె ఆశలను కోల్పోయిన మనుషుల్లో చిగుళ్ళు తొడిగే దైర్యాన్నిచ్చి సర్వ శుభాలు ఈ ఉగాది పండుగ సందర్భంగా భగవంతుడు చేకూర్చాలన్నారు.
ఒక్క ఉగాదే కాకుండా మన పండుగలన్నీ మానసిక బలాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని అందించి జీవితాన్ని మరింత సారవంతం చేసేవని పూజారి పఠిస్తూ ఈ ఉగాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ముందుగా
ఈ వేడుకలకు హాజరైన ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుకు ఆలయ కమిటీ తరపున రెడ్డి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒగ్గు డోలు కళాకారులు డప్పులు వాయిస్తూ
స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయం లో పోలాడి రామారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతులు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సర సందర్భంగా ఉమ్మడి జిల్లా, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు పోలాడి రామారావు తెలుగు సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రెడ్డి, రమేష్ రావు, శ్రీనివాస్ గౌడ్, సాగర్, మహేందర్ పర్ష రాములు, సాయి కుమార్, చుట్టు పక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 ఒగ్గుడోలు కళాకారుల కళా ప్రదర్శన తిలకిస్తున్న గ్రామస్తులు..
Oplus_131072 పంచాంగ శ్రవణంలో పాల్గొన్న పోరాడి రామారావు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!