30-03-2025 NORMAL NEWS 09:03 PM
swarnodayam.com
Telugu Daily News
30-03-2025 09:03 PM By Mandala Yadagiri

ఏప్రిల్ 1 నుంచి హుజురాబాద్ లో బీసీ ఆజాది నిరవధిక దీక్ష.. – బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్.

ఏప్రిల్ 1 నుంచి హుజురాబాద్ లో బీసీ ఆజాది నిరవధిక దీక్ష.. – బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశవ్యాప్త కుల గణన చేపట్టాలని, తెలంగాణ బీసీ బిల్ ను పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి హుజురాబాద్ లో బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరావధిక రిలే నిరాహార దీక్షలను ఏర్పాటు చేసుకున్నట్లు బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ తెలిపారు.

ఈ దేశానికి వెన్నుముకగా ఉండి ఉత్పత్తి, శ్రామికవర్గాలుగా ఈ దేశాన్ని నడిపిస్తున్న బీసీ వర్గాలు నేటికీ వెనుకబడిన వర్గాలుగానే మిగిలి ఉన్నారన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో నష్టపోతున్నారని జనాభాలో 52శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని హక్కులు హరించబడుతున్నాయని అన్నారు, స్వాతంత్ర భారతదేశంలో బీసీలు బానిసలుగా మార్చబడ్డారని, విముక్తి చేయడానికి దేశవ్యాప్త స్వతంత్ర పోరాటాన్ని చేయాల్సిన పరిస్థితులు ఎదురైనాయని, బీసీల విముక్తికోసం బీసీ ఆజాది పోరాటం చేస్తున్నామని అన్నారు, స్వతంత్రానికి పూర్వమే 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వం చేసిన లెక్కలు కులాల వారిగా లెక్కలు చేసి హక్కులను పంచిందని కానీ స్వతంత్ర భారతదేశంలో బీసీల హక్కులు హరించబడి ఉన్నాయని బీసీలకు హక్కులు కావాలంటే మొదట లెక్కలు కావాలని లెక్కలు లేని సాకు వల్ల కోర్టులు బీసీల హక్కులకు అడ్డుపడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని కానీ ప్రభుత్వం తమ కుర్చీలు కాపాడుకోవడానికి బీసీలను మోసం చేస్తుందని అన్నారు, కాబట్టి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ నేత దేశవ్యాప్త ఉద్యమంతో కులగణన సాధించేందుకు గత 15 రోజులుగా డిల్లీలో అన్ని రాజకీయాల పార్టీల కార్యాలయాల్లో నాయకులను, పార్లమెంటు సభ్యులను కలుస్తూ కుల గణన కోసం ఒప్పిస్తున్నారని, ఏప్రిల్ ఒకటి వరకు స్పష్టత ఇవ్వని పక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించారని ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ప్రాణాలకు తెగించి బీసీల కోసం ఢిల్లీలో పోరాటం చేస్తున్న జక్కని సంజయ్ నేతకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త పోరాటాన్ని చేయబోతున్నామని చెప్పారు. ఏప్రిల్ ఒకటి నుంచి హుజురాబాద్ లో నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యసబట్టు మధుసూదన్ రాజు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిలుక మారి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు జినుకల లక్ష్మణరావు, గాజవెల్లి మనోహర్, ఇప్పకాయల సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 నిరవధిక దీక్ష వాల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న బీసీ ఆజాద్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!