31-03-2025 NORMAL NEWS 11:55 AM
swarnodayam.com
Telugu Daily News
31-03-2025 11:55 AM By Mandala Yadagiri

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్
IMG-20250331-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ ప్రజలకు, ప్రత్యేకించి ముస్లిం సోదరులు, సోదరీమణులకు హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్ లు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రంజాన్ పవిత్రత, సహనాన్ని, సేవా భావాన్ని, ప్రేమను బోధించే దివ్య మాసమని పేర్కొన్నారు. అల్లాహ్ అనుగ్రహంతో అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి నిండాలని ఆకాంక్షించారు. అంతేకాక మతసామరస్యం, స్నేహభావం మరింత పరిపుష్టం కావాలని, సమాజంలో సౌహార్ద వాతావరణం ప్రబలాలని వారు పిలుపునిచ్చారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, తౌసిఫ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!