Social 1080×1350 • Multi-page
31-03-2025 BREAKING NEWS 06:15 PM
swarnodayam.com
Telugu Daily News

పేద ముస్లింలకు బిజెపి నేత చేయూత..

పేద ముస్లింలకు బిజెపి నేత చేయూత..
IMG-20250331-WA0152

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర పెఱిక సంఘ కార్యదర్శి మరియు బీజేపీ హుజురాబాద్ సినియర్ నాయకుడు అంకతి శ్రీనివాస్ పేద ముస్లిం కుటుంబాలకు తనకు తోచిన విధంగా సహాయం చేసి పెద్దమనసూ చాటుకున్నారు. ముస్లిం సోదర సోదరీమణులందరికి
పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల కఠిన ఉపవాసాల అనంతరం నిన్న కనిపించిన నెలవంక ఆధారంగా ఈ రోజు రంజాన్ పండుగను మన ముస్లిం సోదరులు జరుపుకోవడం సంతోషకరం అన్నారు. నెల రోజుల కఠిన ఉపవాస అనంతరం నేడు రంజాన్ పండుగ జరుపుకుంటున్న మన ముస్లిం సోదర సోదరీమణులందరికి చాంద్ ముబారక్ తో పాటు రంజాన్ ఈద్ ముబారక్ తెలుపుతున్నానన్నారు. ఈ రంజాన్ ఈద్ ను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని, ఆ అల్లాహ్ ఆశీస్సులు అందరికి ఉండాలని మనసారా కోరుకుంటున్నాననీ చెప్పారు. నాలుగో వార్డ్ లోని పేద ముస్లింలకు పాలు, చికెన్ తదితర నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ రావుల వేణు, మునిగింటి నాగరాజు, కొలిపాక శ్రీనివాస్, అంకతి సాయి గణేష్ పాల్గొన్నారు.

హుజురాబాద్ లోని నాలుగో వార్డుకు చెందిన నిరుపేద ముస్లింలకు తనకు తోచిన సహాయం అందజేస్తున్న బిజెపి నాయకుడు అంకతి శ్రీనివాస్, ఇతర నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!