31-03-2025 NORMAL NEWS 07:08 PM
swarnodayam.com
Telugu Daily News
31-03-2025 07:08 PM By Mandala Yadagiri

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు

భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోనీ గ్రామాలలో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువులు రంజాన్ పండుగ సందర్భంగా పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. ఖురాన్ లో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ప్రతి ముస్లిం పాటించాలన్నారు. శాంతియుతంగా జీవించాలని, పేదలకు సాయం చేయాలని ప్రజలందరూ ధనిక పేద తేడా లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థనల అనంతరం చిన్న పెద్ద తేడా లేకుండా ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. అనంతరం పూర్వికుల సమాధుల వద్ద ప్రార్థనలు చేసారు. ఈ కార్యక్రమంలో మత గురువు ముఫ్తీ షాకీర్, ముస్లిం నాయకులు ఎండి ముజాహిద్ హుస్సేన్ , ఎండి జలాలుద్దీన్ అక్బర్, అజిమొద్దీన్, కరీం, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

హుజురాబాద్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!