Social 1080×1350 • Multi-page
31-03-2025 BREAKING NEWS 09:02 PM
swarnodayam.com
Telugu Daily News

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు.. – రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీల పెంపు.. – రేపటినుండి అమలులోకి రానున్న కొత్త టోల్ ఛార్జీలు
IMG-20250331-WA0156

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు ఉగాది పండుగ అందరికీ తీపి వంచితే వాహనదారులకు చేదు పంచుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచి రేపటినుండి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.34 నుండి రూ.2.44కు పెంపు, మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుండి రూ.3.94కు పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69 నుండి రూ.7కు పెంచింది. భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.15.09 నుండి రూ.15.78కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. రేపటినుండి వాహనదారుల వద్ద పక్కాగా వసూలు చేయనున్నట్లు సమాచారం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!