Social 1080×1350 • Multi-page
01-04-2025 BREAKING NEWS 01:39 PM
swarnodayam.com
Telugu Daily News

పేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం పథకం. — యూత్ కాంగ్రెస్ నాయకులు.

పేదల ఆకలి తీర్చేందుకే సన్న బియ్యం పథకం. — యూత్ కాంగ్రెస్ నాయకులు.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: పేద ప్రజల ఆకలి గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, పేదల కోసమే సన్నబియ్యం పథకం అని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదల కోసం అనునిత్యం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని, నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఉగాది రోజున సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సాహు తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సన్న బియ్యం పథకాన్ని స్వాగతించాలని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమం లో NSUI మండల నాయకులు ప్రదీప్ గౌడ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యువరాజ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు వినయ్ గౌడ్, నితిన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 విలేకరులతో మాట్లాడుతున్న యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనిగరపు సాహు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!