01-04-2025 NORMAL NEWS 05:14 PM
swarnodayam.com
Telugu Daily News
01-04-2025 05:14 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో యధేచ్చగా జల వనరుల కబ్జాలు..- చిలుక వాగును సైతం వదలని కబ్జా రాయుళ్ళు..-హుజురాబాద్ లో జరుగుతున్న భూకబ్జాలపై కలెక్టర్ విచారణ జరపాలి. – ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్యముదిరాజ్ డిమాండ్.

హుజురాబాద్ లో యధేచ్చగా జల వనరుల కబ్జాలు..- చిలుక వాగును సైతం వదలని కబ్జా రాయుళ్ళు..-హుజురాబాద్ లో జరుగుతున్న భూకబ్జాలపై కలెక్టర్  విచారణ జరపాలి. – ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్యముదిరాజ్ డిమాండ్.
IMG-20250401-WA0164

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డును అనుకోని పెద్దమొరి క్రిందుగా ప్రవహించే చిలుకవాగును పక్కన భూమి కలిగిన ఆసాములు అక్రమంగా పూడ్చి కబ్జాలు చేసి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కళ్ల ముందే కమర్షియల్ కాంప్లెక్స్ లు కడుతుంటే చర్యలు తీసుకోవలసిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో అంత్యరం ఏమిటని, మామూళ్ల మత్తులో గాని పడి బాధ్యతలు ఏమన్నా మరిచార అని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్యముదిరాజ్ ప్రశ్నించారు. హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా పట్టణంలోని కుంటలు చెరువులు వాటి కట్టుకాలువలు కబ్జాలకు గురౌతున్నాయని ఎన్నోసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎంతో మంది నిస్వార్థ పాత్రికేయులు కధనాలు రాసిన చర్యలు మాత్రం శూన్యమని సమ్మయ్య ఆవేదన వ్యక్తంచేశారు. మళ్ళీ ఇప్పుడు హుజురాబాద్ లోని నర్సింగాపూర్ ను అనుకోని ప్రవహిస్తు వాగు పొడవునా అక్కడక్కడా నిర్మించిన చెక్ డ్యామ్ లలో నీటిని రిజర్వు చేస్తూ పరివాహంలో ఉన్న పంటలకు నీరందిస్తూ రైతులకు ఆసారానిస్తూ చెల్పూరు చెరువును నింపే చిలుకవాగును సైతం కబ్జాదారులు వదలడం లేదని, ఇందుకు కారణం సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనని సమ్మయ్య ఆరోపించారు. చెరువు శిఖం ప్రక్కనున్న భూములకు కట్టుకాలువల పక్కన భూములకు వాగుల ప్రక్కన గల భూములలో కట్టడాలు జరపాలంటే రెవెన్యూ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే ఎన్ఓసితో పాటు గ్రామ పంచాయితీ వారు ఇచ్చే పర్మిషన్ ఉండాలని, అవేవి లేకుండానే యథేచ్ఛగా పట్టణ శివారు పెద్ద పాపయ్యపల్లి ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్నయని సమ్మయ్య ఆరోపించారు. ఇప్పటికైనా హుజురాబాద్ లో జరుగుతున్న అక్రమ కబ్జాలపై జిల్లా కలెక్టర్ స్పందించి అధికారం ఉండి కూడ అక్రమ కబ్జాలను పట్టించుకోని అధికారులపై అలాగే తప్పనితెలిసిన ప్రభుత్వ భూములను చెరువులు వాగులను కబ్జాలు చేస్తున్న కబ్జా రాయుళ్ల పై విచారణకు ఆదేశించాలని ఈ సందర్భంగా సమ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు స్పందించి చిలుకవాగును పూడ్చి కబ్జా చేసి నిర్మాణాలు చేసిన వారిని గుర్తించి చట్టపరమై చర్యలు తీసుకోవాలని, చిలుక వాగుకు పట్టణంలోని చెరువులకు, కుంటలకు కట్టు కాలువలకు హద్దులు బీటాయించాలని లేని పక్షంలో చెరువులు కుంటలు వాగులు ప్రభుత్వ భూముల పరిరక్షణకై కరీంనగర్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు హుజురాబాద్ లో జరుగుతున్న అక్రమ ప్రభుత్వ భూముల జల వనరుల కబ్జాలపై ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు చేపడతామని ఈ సందర్భంగా సమ్మయ్య ముదిరాజ్ తెలిపారు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!