Social 1080×1350 • Multi-page
02-04-2025 BREAKING NEWS 10:16 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా నరేడ్ల వినోద్ రెడ్డి

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా నరేడ్ల వినోద్ రెడ్డి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన నరేడ్ల వినోద్ రెడ్డిని నియమిస్తూ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, జిల్లా అధ్యక్షులు పత్తి మధుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వినోద్ రెడ్డి విశేషంగా కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతుండడంతో ఆయనను ఈ పదవిలో నియమించినట్లు వారి పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ జెండా ఎగరాలని వారు సూచించారు. నాపైన ఉన్న నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన పైన పెట్టిన ఈ బాధ్యతను మరింత ఉత్సహంతో పార్టీకోసం పనిచేస్తానని సేవాదళ్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు నరెడ్ల వినోద్ రెడ్డి పేర్కొన్నారు. నాపై నమ్మకంతో పదవి అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, జిల్లా అధ్యక్షుడు మధుబాబు, సహకరించిన డీసీసీ అధ్యక్షులు కవ్వం పల్లి సత్యనారాయణకి, హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబుకి, పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డికి ఇతర జిల్లా, నియోజకవర్గ నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రేస్ సేవాదళ్ అధ్యక్షులుగా నరేడ్ల వినోద్ రెడ్డిని శాలువా కప్పి సత్కరిస్తున్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ బాబు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!