Social 1080×1350 • Multi-page
02-04-2025 BREAKING NEWS 05:23 PM
swarnodayam.com
Telugu Daily News

హెచ్ సియూ భూములను కాపాడాలి.. -సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్

హెచ్ సియూ భూములను కాపాడాలి.. -సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్
IMG-20250402-WA0163

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సిపిఎం పార్టీ ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల, నాయకులను ,కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించడం సరైనది కాదని ఆరోపించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టకూడదని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ
రాష్ట్రంలో ప్రజా పాలన ముస్కులో నిర్బంధ పాలన సాగుతుందని , ప్రజా పాలన సాగడం లేదని ప్రభుత్వ అధికార యంత్రాంగం పోలీసులను ఉసిగొల్పుతూ నాయకుల ఇళ్ళలోకి వెళ్లి అరెస్ట్ చేయడం, పోరాటాలు చేస్తున్న నాయకులను నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ సియూ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా రాత్రికి రాత్రే అడవులను తగలబెట్టడం మూలంగా వన్యప్రాణులు, జీవచరాలు మరణించాయని, యూనివర్సిటీ కి చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అమ్ముకుంటుందని గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, యూనివర్సిటీ భూములను పరిరక్షించేంతవరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి అనేక విధాలుగా పోరాటాలు చేస్తామని అన్నారు.
గతంలో విద్యార్థులకు ఇచ్చిన భూములను ఏ విధంగా లాక్కుంటారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములపై పోరాడుతున్న విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనయించారని, ఇది సరైన కాదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కోంకట చంద్రయ్య, మైస చేరాలు, అన్న ప్రశాంత్, ఏ రమేష్, అందేష్ రవి, ఏం రవి, పొడిసెట్టి ప్రభుశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!