Social 1080×1350 • Multi-page
02-04-2025 BREAKING NEWS 07:16 PM
swarnodayam.com
Telugu Daily News

రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..

రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం.. – కాంగ్రెస్ నేత ప్రణవ్..
IMG-20250402-WA0205
  • వాడ వాడలా ఉత్సాహంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర.
  • గాంధీ,అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం.
  • బీజేపి మత రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు.1
  • మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతూ,రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. బుదవారం రోజున హుజురాబాద్ మండల పరిధిలోని పోతిరెడ్డిపేట గ్రామంలో ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను గ్రామంలోని వాడ వాడకు నిర్వహించారు. రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ్ భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా దేశమంతటా పాదయాత్ర చేపట్టారనీ, తద్వారా బీజేపి రాజ్యాంగ విరుద్ధ పనులకు అడ్డుకట్ట వేయగలిగామని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ను విమర్శిస్తూ అవమాణపరిచారని, మతాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు.తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.స్వాతంత్రం కొట్లడిన గాంధీజీనీ, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడతమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు, కాంగ్రెస్ అనుభంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!