Social 1080×1350 • Multi-page
02-04-2025 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

సింగాపురం విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో…నేటి నుండి -విబ్జీయర్ 2025 స్టూడెంట్స్ కల్చరార్ పెస్ట్

సింగాపురం విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో…నేటి నుండి -విబ్జీయర్ 2025 స్టూడెంట్స్ కల్చరార్ పెస్ట్
IMG-20250402-WA0218
  • పోస్టర్ ఆవిష్కరించిన కమల ఎడ్యుకేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 2 : హుజురాబాద్ మండలం సింగాపురంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నుండి వారం రోజుల పాటు విబ్జీయర్- 2025 పేరుతో విద్యార్థుల ఉత్సవం జరగనుంది. ఈ నెల తొమ్మిదో తేదిన జరిగే కార్యక్రమానికి శాతవాహన కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఓఎస్డి డా”హరికాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కమల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్, మాజీ ఎంపీ వి.లక్ష్మీకాంతారావు, సెక్రెటరీ, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, అకడమిక్ అడ్వయిజర్ డా. వొడితల షమిత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్ హాజరవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. హనుమకుమార్ తెలిపారు. కాగా విబ్జీయర్- 2025 పోస్టర్ ను కమల ఎడ్యుకేషన్ సొసైటీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంద్రనీల్ బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రారంభించి 20 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్బంగా విబ్జీయర్ 2025 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభ బయటకు వస్తుందని, విద్యార్థుల్లో స్నేహ భావం పెంపొందుతుందని, వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని అన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని, ప్రభుత్వ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ కు కూడా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న కమల ఎడ్యుకేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వొడితల ఇంద్రనీల్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!