Social 1080×1350 • Multi-page
02-04-2025 BREAKING NEWS 11:48 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాటు చేయండి

శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాటు చేయండి
IMG-20250402-WA0153

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 6వ తేదీ ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలో జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేస్తూ ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యకు టిఆర్ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి తోట రాజేంద్రప్రసాద్ అపరాధ ముత్యం రాజు, నాయకులు గంధి శ్రీనివాస్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!