Social 1080×1350 • Multi-page
04-04-2025 BREAKING NEWS 06:40 AM
swarnodayam.com
Telugu Daily News

వెంకట్రావుపల్లి గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

వెంకట్రావుపల్లి గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
IMG_20250404_063711

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు హుజురాబాద్ మండల పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో వాడ, వాడలా పాదయాత్ర చేసారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగాన్ని అవమానిస్తుంది అని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మరియు భారత దేశ సౌభ్రాతృత్వాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072వెంకట్రావుపల్లి గ్రామంలో జై బాపు,జై భీం,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!