04-04-2025 NORMAL NEWS 11:17 AM
swarnodayam.com
Telugu Daily News
04-04-2025 11:17 AM By Mandala Yadagiri

రోడ్డు ప్రమాదంలో హనుమాన్ భక్తుడి దుర్మరణం.

రోడ్డు ప్రమాదంలో హనుమాన్ భక్తుడి దుర్మరణం.
IMG_20250404_111325

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని హనుమాన్ మాల ధారణ ధరించిన వ్యక్తి(30-40 వయసు గల) దుర్మరణం చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 27 ఏ 78 44 నంబర్ గల సిటి 100 ద్విచక్ర వాహనదారున్నీ గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. ద్విచక్ర వాహనం వెనుక హెడ్లైట్ పై భూమేష్, అమ్మానాన్న అని రాసి ఉంది. హనుమాన్ మారదారుడు కావడంతో అతని వద్ద ఎలాంటి ధ్రువపత్రాలు లేవు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ తిరుమల గౌడ్ తెలిపారు. పూర్తి వివరాలు సీసీ కెమెరాల ఆధారంగా రాబట్టే పనిలో పోలీసులు పడ్డారు.

Oplus_131072
Oplus_131072 రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన హనుమాన్ మాలదారుడు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్యన వయసు ఉంటుంది.
Oplus_131072
facebook sharing button
twitter sharing button
email sharing button
whatsapp sharing button
sharethis sharing button

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!