Social 1080×1350 • Multi-page
05-04-2025 BREAKING NEWS 05:58 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రమాదంలో మరణించిన వ్యక్తి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. – హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్

ప్రమాదంలో మరణించిన వ్యక్తి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. – హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్
IMG_20250405_175629

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని సింగపూర్ గ్రామం వద్ద శుక్రవారం 4/4/25 జరిగిన లారీ యాక్సిడెంట్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. పోలీసులకు ఉన్న కొంత సమాచారం ప్రకారం అతని పేరు రాకేష్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి హుజురాబాద్ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడో తెలియడం లేదని అన్నారు. వ్యక్తి ఆరెంజ్ కలర్ షర్టు, వైట్ ప్యాంటు ధరించాడని అన్నారు. యువకుని వివరాలు తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ తిరుమల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సమాచారం మరింత త్వరగా వెళ్లేందుకు ప్రతి ఒక్కరు తమ వద్ద ఉన్న సోషల్ మీడియా గ్రూపులలో వైరల్ చేయాలని అన్నారు. ఎవరికైనా యువకుడి వివరాలు తెలిస్తే 8712670773, 7569919123 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!