05-04-2025 NORMAL NEWS 07:54 PM
swarnodayam.com
Telugu Daily News
05-04-2025 07:54 PM By Mandala Yadagiri

చేల్పూరులో బాలవికాస ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

చేల్పూరులో బాలవికాస ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
IMG_20250405_195120

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో జన వికాస సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఎండాకాలం బాటసారులకు దాహార్తిని తీర్చుటకు ఈ చలివేంద్రం చాలా తోడ్పడుతుందనీ, అన్ని దానాలలో కల్లా నీళ్ల దానం గొప్పదని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన బుజ్జ సరిత మరియు అంబాల కుమారస్వామి, జేబునిస దాతలుగా ఈ జలదాన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలవికాస హుజురాబాద్ ఏరియా సెంటర్ మేనేజర్ ఖాజాబీ, రజిత, కళ్యాణి, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 చలివేంద్రం ప్రారంభించి నీటి దానం చేస్తున్న నిర్వాహకురాలు ఖాజాబీ..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!