Social 1080×1350 • Multi-page
05-04-2025 BREAKING NEWS 08:29 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
IMG_20250405_202309

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: భారత మాజీ ఉపరాష్ట్రపతి స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలు శనివారం హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మన దేశానికి చేసిన సేవలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చూపిన తెగువ గురించి స్మరించుకున్నారు జగ్జీవన్ రామ్ చూపిన బాటలో నేటి యువత నడవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు మట్టెడ ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందె రాధిక, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, రుద్రారపు రామచంద్రం, మారేపల్లి శ్రీనివాస్, ఎండి ఖలీద్ హుస్సేన్ , మాడుగుల ఓదెలు, మేకల తిరుపతి, కొలిపాక సమ్మయ్య, తునికి సమ్మయ్య, రాజలింగం, శ్రీనివాస్ పటేల్, చంద్రశేఖర్, లక్ష్మణమూర్తి, కొండ్ర నరేష్, వెంకటరాజo, మోరే మధు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

పూలమాలవేసి నివాళులర్పిస్తున్న మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, తదితరులు..

Oplus_131072 నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు..

నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!