Social 1080×1350 • Multi-page
05-04-2025 BREAKING NEWS 08:51 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ పెరక క్షత్రియ సంఘ రాష్ట్ర కార్యదర్శి అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

తెలంగాణ పెరక క్షత్రియ సంఘ రాష్ట్ర కార్యదర్శి అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
IMG-20250405-WA0130

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ పెరక క్షత్రియ సంఘ రాష్ట్ర కార్యదర్శి అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిషలు శ్రమించిన వేకువ కిరణం అన్నారు. సామాజిక న్యాయమే సమత్వ సాధన అని చాటి చెప్పిన వెలుతురు కణం, అంటరానితనం నిర్మూలనకు తన జీవితాన్ని త్యాగం చేసిన అసలు సిసలు జననేత అన్నారు. భారత దేశ పార్లమెంటు చరిత్రలో అత్యధిక కాలం పార్లమెంటేరియన్ గా పనిచేసిన ప్రజా హృదయభ్రాత బాబు జగ్జీవన్ రాం అని కొనియాడారు.
1971లో ఎండోపాక్ యుద్ధం జరిగినప్పుడు రక్షణ మంత్రిగా వ్యవహరించారని, రైతుల కోసం అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశ హితం అనేక బాధ్యతలు నిర్వహించి భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చారని శ్రీనివాస్ కొనియాడారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!