Social 1080×1350 • Multi-page
05-04-2025 BREAKING NEWS 10:06 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మండలంలో గ్రామ గ్రామాన ఉత్సాహంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర

హుజురాబాద్ మండలంలో గ్రామ గ్రామాన ఉత్సాహంగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పాదయాత్ర
IMG-20250405-WA0156

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండల పరిధిలోని కాట్రపల్లి గ్రామంలో” జై బాపు, జై భీం, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర” కార్యక్రమం నిర్వహించారు. దీనిలో KUDA చెర్మన్ వెంకట్రాంరెడ్డి మరియు కరీంనగర్ జిల్లా యస్టి సెల్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఆయా గ్రామాల అధ్యక్షులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా అతిథులు వారితో కలిసి వాడ, వాడలా పాదయాత్ర చేసారు.

జాతీయ కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈ రోజు హుజురాబాద్ పట్టణంలోని 28వ వార్డు, 26వ వార్డు మరియు 21వ వార్డులలో నిర్వహించారు. దీనిలో హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల తిరుపతి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడూరి స్వామి రెడ్డి, సొల్లు బాబు, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అరవింద్, గుర్రం హరి, సొల్లు దశరథం, తలపల్లి రమేష్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, చింతల నరేష్, ఉమా శంకర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

కాట్రపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు..

Oplus_131072
Oplus_131072

హుజురాబాద్ పట్టణంలో జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహిస్తున్న పట్టణ అధ్యక్షురాలు పుష్పలత, మహిళా నాయకురాళ్ళు.. కార్యకర్తలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!