Social 1080×1350 • Multi-page
06-04-2025 BREAKING NEWS 01:54 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు

హుజురాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు
IMG_20250406_135306

–భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే వెన్నెముక
– భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే బలం
-బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ ఆవిర్బావ దినోత్సవం పురస్కరించుకొని బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు రెండు ఎంపీ స్థానాలతోని మొదలుకొని ఈరోజు కేంద్రంలో బలమైన ప్రభుత్వంగా మరియు 21 రాష్ట్రాలలో అధికారంలో ఉండడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ హితం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. 370 ఆర్టికల్ రద్దు, రామ మందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్ రద్దు, ఆత్మ నిర్భర్ భారత్, దేశ రక్షణ దేశ భద్రత విషయంలో ముందుండటం, కార్మిక సంస్కరణలు, నగదు బదిలీ, ఆర్థిక సంస్కరణలు, రైతు సంక్షేమం, పేదల సంక్షేమ పథకాలు, నూతన విద్యా విధానం, సంస్కృతి సాంప్రదాయాల కళను పెంచడం, అవినీతి రహిత సమాజాన్ని తయారు చేయడం కొరకు కృషి చేయడం ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చారానన్నారు. మహనీయుల యొక్క జీవిత చరిత్రను పునికిపిచ్చుకొని పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రానున్న హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరడానికి నాయకులు కార్యకర్తలు ఇప్పటినుండే కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజు, ఫైళ్ల వెంకటరెడ్డి, నల్ల సుమన్, గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, అంకటి వాసు, నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, యల్లా సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, కొలిపాక వెంకటేష్, యంసాని శశిధర్, కొలిపాక శ్రీనివాస్, కొడిమ్యాల పవన్, బోరగాల సారయ్య, గంట సంపత్, నరేండ్ల ప్రవీణ్, మునిగంటి నాగరాజు, మోలుగురి నాగరాజు, ఆవుల సదయ్య, గుర్రం సంతోష్, తాళ్లపల్లి హరీష్, పల్లె వీరయ్య, తేలుకుంట్ల శ్రీనివాస్, కెక్కెర రేణుక, గూడూరి రాంరెడ్డి, యాట రాజేష్ కన్నా, గరిగే శివకృష్ణ, మోలుగురి అభి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతున్న పట్టణ అధ్యక్షుడు రాజు…

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!