06-04-2025 NORMAL NEWS 09:45 PM
swarnodayam.com
Telugu Daily News
06-04-2025 09:45 PM By Mandala Yadagiri

” రామనామ స్మరణ” తో భక్తి పారవశ్యమైన విద్యానగర్ కాలనీ

” రామనామ స్మరణ” తో భక్తి పారవశ్యమైన విద్యానగర్ కాలనీ
IMG-20250406-WA0138

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ స్థానిక పట్టణంలోని విద్యానగర్ లో ఆదివారం ఉదయం 10 గంటల నుండి విద్యానగర్ కాలనీ వాసులు ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు సుమారు 500 మంది హాజరై తమ భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించగా భక్తులతో విద్యానగర్ కిటకిట లాడింది. “రామ నామ “స్మరణతో కళ్యాణ వేడుక పరవశించిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానంతరం తీర్థప్రసాదాలు భక్తులకు ఇచ్చి అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు తమకు ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు కలగకుండా కళ్యాణ కార్యక్రమ నిర్వాహకులు చూశారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని భక్తులు తెలిపారు. కాగా దాతల సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమగోని సురేష్ దొనకొండ సత్యనారాయణ రెడ్డి రాగల రాజు రెడ్డి కళ్ళెపు మోహన్రావు రాజేంద్రప్రసాద్ నారాయణరెడ్డి వెంకట్రాజం శివాజీ యాల్ల సంజీవరెడ్డి, పి ప్రభావతిరెడ్డితో పాటు విద్యానగర్ లోని 25వ వార్డు, 30 వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!