Social 1080×1350 • Multi-page
07-04-2025 BREAKING NEWS 04:30 PM
swarnodayam.com
Telugu Daily News

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.. -టీయూడబ్ల్యూజే(ఐజేయు) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి

ఐజేయూతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం.. -టీయూడబ్ల్యూజే(ఐజేయు) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి
1002443059

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: ఐజేయూ అనుబంధ టియుడబ్ల్యూజే తోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం సాధ్యమని టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి అన్నారు. పరకాల పట్టణంలో టీయూడబ్ల్యూజేే ఐజేయు యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ముందుండి పోరాటం సాగిస్తున్న సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయూ)మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు, హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు సాధించి పెట్టిన ఘనత ఈ సంఘానికే ఉందన్నారు. రానున్న రోజుల్లో వరంగల్ నగరంతో సహా మండల కేంద్రాలలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించేందుకు పోరాడుతామన్నారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ సమస్యల సాధనకై జర్నలిస్టులకు అండగా టీయూడబ్ల్యూజేే నిలుస్తుందని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల జారి,ఇతర సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అమలుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు. ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న యూనియన్ పై జర్నలిస్టులకు ఎంతో విశ్వాసం ఉందని, ప్రతి జర్నలిస్టు ఐజేయూలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాడిపల్లి మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, జిల్లా కోశాధికారి పురుషోత్తం, ఈసీ మెంబర్లు, పరకాల డివిజన్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో టీయూడబ్ల్యూజేే ఐజేయు యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న టీయూడబ్ల్యూజేే (ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం రాజిరెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!