Social 1080×1350 • Multi-page
10-04-2025 BREAKING NEWS 06:26 PM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ లో తప్పిన పెను ప్రమాదం! – గంగాధర మండలం మధురానగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు – ఆటో ఢీ… ఆటోలో అక్రమంగా తరలిస్తు బయటపడిన జిలిటిన్ స్టిక్స్..- ఈ ఘటన జిల్లాలో కలకలం

కరీంనగర్ లో తప్పిన పెను ప్రమాదం! – గంగాధర మండలం మధురానగర్ సమీపంలో ఆర్టీసీ బస్సు – ఆటో ఢీ… ఆటోలో అక్రమంగా తరలిస్తు బయటపడిన జిలిటిన్ స్టిక్స్..- ఈ ఘటన జిల్లాలో కలకలం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ సమీపంలో గురువారం ఉదయం రోడ్డుప్రమాదం కలకలం రేపింది. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ఢీ కొట్టిన ఘటనలో ఆటో బోల్తాపడగా, అందులో అక్రమంగా తరలిస్తున్న రెండు కాటన్ బాక్సుల్లో ఉన్న జిలిటిన్ స్టిక్స్ బయటపడినట్లు తెలుస్తోంది. తన తప్పును దాచేందుకు ప్రయత్నించిన ఆటో డ్రైవర్, జిలిటిన్ స్టిక్స్ ఉన్న రెండు బాక్సులను పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి అక్కడినుంచి పారిపోయాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జిలిటిన్ స్టిక్స్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నామంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగీస్తున్నారు.

Oplus_131072 బోల్తా పడిన ఆటో అందులో లభించిన రెండు బాక్సుల జిలేటెన్ స్టిక్స్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!