Social 1080×1350 • Multi-page
10-04-2025 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని యూకేలో నివసించే కుమార్తె బుర్ల స్పందన ప్రశాంత్.. – అనాథ ఆశ్రమంలో అన్నదానం.

తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని యూకేలో నివసించే కుమార్తె బుర్ల స్పందన ప్రశాంత్.. – అనాథ ఆశ్రమంలో అన్నదానం.
IMG-20250410-WA0070

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఏప్రిల్ 10:జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కుమార్తె శ్రీమతి బుర్ల స్పందన ప్రశాంత్, యునైటెడ్ కింగ్‌డమ్‌లో నివసిస్తూ గోదావరిఖనిలోని ‘అమ్మ పరివార్’ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమ చిన్నారులకు అన్నప్రసాదాన్ని అందజేసి, తండ్రి జన్మదినాన్ని మానవతా దృక్పథంతో జరిపారు. అనంతరం వెంకటేష్ కేక్ కట్ చేసి బాలలతో ఆనందాన్ని పంచుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సుతారి లక్ష్మణ్ బాబు, వెంకటేష్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఎన్‌ఎస్‌యు‌ఐ నుంచి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, ప్రజల సమస్యలపై చొరవగా పనిచేస్తున్న వెంకటేష్ నిజమైన ప్రజానాయకుడు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి” అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేత బాయిని మల్లేశ్ యాదవ్, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు ఉప్పులేటి పర్వతాలు, వెంకటేష్ కుమారుడు నాగ్, మిత్రులు విజయ్, మారుతి, సాయి, అరవింద్, మణిశ్వర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

అనాధ శరణాలయంలో కేక్ కట్ చేసి అన్నదానం చేస్తున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మంధేన వెంకటేష్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!