Social 1080×1350 • Multi-page
10-04-2025 BREAKING NEWS 09:58 PM
swarnodayam.com
Telugu Daily News

8 మంది పేకాటరాయల అరెస్ట్.. రూ 16,710 సీజ్.

8 మంది పేకాటరాయల అరెస్ట్.. రూ 16,710 సీజ్.
IMG-20250410-WA0120

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రోజున సాయంత్రం 6 గంటలకు హుజురాబాద్ పీఎస్ పరిధిలోనీ వరంగల్ రోడ్డులో గల అన్నపూర్ణ లాడ్జిలో ఒక రూమ్ లో మూడు ముక్కల పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకొని వారి దగ్గర నుండి రూ. 16,710 రూపాయలను, పేక ముక్కలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. పట్టుబడిన వారిలో ఏ సతీష్, బి బాబు, ఏం రవీందర్ రెడ్డి, ఏం పుల్లారెడ్డి, పి రాజు, యు శ్రీనివాస్, పి అరవింద్ కుమార్, డి నరేష్ లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా హుజురాబాద్ పీఎస్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఇన్స్పెక్టర్ జీ.తిరుమల్ గౌడ్ హెచ్చరించారు. అయితే పేకాట రాయుళ్లు ఉపయోగించినా సెల్ ఫోన్లు, లాడ్జికి చేరేందుకు వాడిన వాహనాలు ఏమయ్యాయి అంటూ సోషల్ మీడియాలో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!