Social 1080×1350 • Multi-page
11-04-2025 BREAKING NEWS 05:51 PM
swarnodayam.com
Telugu Daily News

సమానత్వము ఒక జీవన విలువగా మారినప్పుడే పూలే ఆశయాలు సాధించగలుగుతాం

సమానత్వము ఒక జీవన విలువగా మారినప్పుడే పూలే ఆశయాలు సాధించగలుగుతాం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ 19వ శతాబ్దంలోని కుల వివక్ష బాల్యవివాహాలు, స్త్రీలకు విద్యను నిరాకరించుట మొదలగు సమస్యల నుండి భారత సామాజిక వ్యవస్థను చైతన్యపరిచి తొలి సంఘసంస్కర్తగా పేరొందిన మహాత్మ జ్యోతిబాపూలే జీవిత విశిష్టతను ఈ తరం వారు తెలుసుకొని, ప్రజలు మరియు పాలకులు ఆచరించినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలుగుతాము అని పేర్కొన్నారు. స్త్రీలకు విద్య ద్వారా మాత్రమే సాధికారత లభిస్తుందని నమ్మిన పూలే, స్త్రీ విద్య కొరకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహించారన్నారు. బాలిక విద్య, వయోజన విద్య, వితంతు వివాహం మొదలగు గణనీయమైనటువంటి సామాజిక మార్పులకు పూలే శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. మహాత్మా
పూలే అభిలషించిన సిద్ధాంతాలను, నేటి సమాజంలో అందరమూ ఒక జీవన విలువగా పరిగణించి ఆచరించినప్పుడే వారి ఆశయాలు నెరవేర్చినవారము అవుతామని అని ఈ సందర్భంగా పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవ పథకం సమన్వయకర్త డాక్టర్ ఝాన్సీ రాణి, అధ్యాపకులు డాక్టర్ రేణుక, డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ సుమలత, రమ, డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ నరేందర్, డాక్టర్ ఓదెలు, లింగారెడ్డి, సిబ్బంది , రమేష్, శ్రీనివాస్, అఖిన్, శారద, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072 పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!