11-04-2025 NORMAL NEWS 09:59 PM
swarnodayam.com
Telugu Daily News
11-04-2025 09:59 PM By Mandala Yadagiri

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసేది డబ్ల్యూజేఐ.. – డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్

జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసేది డబ్ల్యూజేఐ.. – డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్
Oplus_131072
  • డబ్ల్యూజేఐ జమ్మికుంట నూతన కమిటీ నియామకం…
  • డబ్ల్యూజేఐ అధ్యక్ష కార్యదర్శులు అంబాల ప్రభాకర్, అయిత రాధాకృష్ణ, కోశాధికారిగా మోరె ప్రశాంత్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, (జమ్మికుంట) ఏప్రిల్ 11: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూ జే ఐ) మాత్రమే అని ఆ సంఘం రాష్ట్ర నాయకులు తాడూరి కరుణాకర్, శివనాధుని ప్రమోద్ కుమార్ అన్నారు. శుక్రవారం జమ్మికుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో జమ్మికుంట మండల నూతన కమిటీని వారు ఎంపిక చేశారు. డబ్ల్యూఐజే జమ్మికుంట మండల అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు అంబాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా నినాదం దినపత్రిక హుజురాబాద్ ఆర్సి ఇంచార్జ్ అయిత రాధాకృష్ణను వారు నియమించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ముందు వరుసలో ఉంటుందని జర్నలిస్టుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్న జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని ఒకవైపు యాజమాన్యాల ఒత్తిడి ఉంటే ఎలాంటి ఆదాయం లేకుండా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుందని వారు అన్నారు. గతంలో ఏ జర్నలిస్టు సంఘం కూడా పూర్తిస్థాయిలో జర్నలిస్టు న్యాయం చేయలేదని రాబోయే రోజుల్లో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత జర్నలిస్టులతో పాటు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల కూడా ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలలో ప్రతిఫలం వచ్చే విధంగా డబ్ల్యూ జేయు ఉంటుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఘాన్ని నూతన కమిటీ ఆధ్వర్యంలో మరింత బలోపేతం చేసి ముందుకు సాగాలని అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వారు సూచించారు. అనంతరం నూతన కమిటీకి వారు శుభాకాంక్షలు తెలిపారు.

జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం..

జమ్మికుంట మండల అధ్యక్ష కార్యదర్శులు..

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జమ్మికుంట మండల అధ్యక్ష కార్యదర్శిగా ఎన్నికైన అంబాల ప్రభాకర్ అయిత రాధాకృష్ణ మాట్లాడుతూ, మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు అన్నారు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ సంఘం సభ్యులందరినీ ఏకం చేసి సంఘం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి మోరె ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు ఎన్. కేదారి, మండల ఉపాధ్యక్షులు, మద్దె ర్ల,కుమారస్వామి, ఎన్.సతీష్, సహాయ కార్యదర్శులు నేదుర సమ్మయ్య, పసునూటి శ్రీకాంత్, కొంగల కుమార్ యాదవ్, కమిటీ సభ్యులు కె. విజయ్, ఎన్.శంకర్, శ్రీనివాస్, దేవేందర్, రాజు, రవి, సుజాత తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న డబ్ల్యూజేఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్,
డబ్ల్యూజేఐ అధ్యక్ష కార్యదర్శులు అంబాల ప్రభాకర్, అయిత రాధాకృష్ణ, కోశాధికారిగా మోరె ప్రశాంత్ లు
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!