11-04-2025 NORMAL NEWS 11:39 PM
swarnodayam.com
Telugu Daily News
11-04-2025 11:39 PM By Mandala Yadagiri

కేంద్ర ప్రభుత్వం waqf board బిల్లు 2025 ను వెంటనే విరమించుకోవాలి..- హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ – ఆర్డిఓ రమేష్ బాబుకు వినతి

కేంద్ర ప్రభుత్వం waqf board బిల్లు 2025 ను వెంటనే విరమించుకోవాలి..- హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ – ఆర్డిఓ రమేష్ బాబుకు వినతి
IMG-20250411-WA0173

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో శుక్రవారం రోజు సాయంత్రం హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు హుజూరాబాద్ డివిజన్ మస్జీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన waqf board 2025 బిల్లును వెంటనే విరమించుకోవాలని భారతదేశ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఒక ఫ్యాక్స్ పంపిస్తూ ఈరోజు హుజురాబాద్ రెవిన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు మక్కా మసీద్ అధ్యక్షులు సయ్యద్ అజీమ్, మజీద్, కౌసర్, అధ్యక్షులు మొహమ్మద్ ఇస్మాయిల్, మజ్జిదే బషీర్ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజ్, మజీద్ అమర్ సెక్రెటరీ మహమ్మద్ ఇమ్రాన్ తో పాటు ముస్లిం నాయకులు మహమ్మద్ సజ్జు, మొహమ్మద్ మజారుద్దీన్, సయ్యద్ సలీం, సయ్యద్ అబ్దుల్లా, మహమ్మద్ బాసుమియా, మహమ్మద్ రహీం, మహమ్మద్ రాజమహమ్మద్, హుజురాబాద్ డివిజన్ జమాత్ ఉలేమ అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బేగ్ తదితరులు కలిసి ఆర్డిఓ రమేష్ బాబుకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన waqf board బిల్లును పార్లమెంట్లో మరియు రాజ్యసభలో ఆమోదం పరిచిన waqt board బిల్లు 2025 దానిని వెంటనే విరమించుకోవాలి అని కోరుతూ ముస్లింలకు సంబంధించిన waqt board భూములలో మస్జిదులు ముస్లిం కబ్రిస్తాన్ దర్గాలు కొన్ని పూర్వపు సంవత్సరాల నుండి ముస్లింలకు సంబంధించిన స్థలాలపై ఇటీవల waqt board బిల్లు పేరుతో ఒక నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చినా ఈ కేంద్ర ప్రభుత్వం waqt board బిల్లును వెంటనే విరమించుకోవాలన్నారు. భారతదేశంలో అంతట ముస్లిం సోదరులు నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఎందుకంటే భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ప్రతి ఒక్కరు ఈ దేశంలో కలిసి మెలిసి ఉంటున్నామన్నారు. అలాంటప్పుడు అందర్నీ ఒకటే కంటి చూపుగా చూడాలి తప్ప ఒకరి మీద ఒత్తిడి చేసి వారి యొక్క ఆస్తుల మీద పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి ముస్లిం వర్గాలను ఇబ్బందులకు గురి చేయటం సమాజసం కాదని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన waqt board బిల్లును వెంటనే విరమించుకోవాలని దేశ ప్రధానమంత్రి మోడీకి, దేశ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మైనార్టీ మంత్రిని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారందరికి విజ్ఞప్తి చేశారు.

ఆర్టీవో రమేష్ బాబుకు ఇచ్చిన మైనార్టీ నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!