Social 1080×1350 • Multi-page
12-04-2025 BREAKING NEWS 02:25 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీరామ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన

శ్రీరామ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన
Oplus_131072
  • 24 గంటల వైద్య సేవాందించడానికి సిద్ధం
  • శ్రీరామ ఆసుపత్రి డాక్టర్ శ్రీకర్
  • మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
  • హుజురాబాద్ లోని శ్రీరామ హాస్పిటల్ లో శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. శ్రీరామ హాస్పిటల్ హుజురాబాద్, ఆర్కే హాస్పిటల్ కరీంనగర్, శరత్ మాక్స్ విజన్ హనుమకొండ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ శిబిరంలో వందల సంఖ్యలో వచ్చిన జనాలకు వారికి వివిధ రకాల టెస్టులు నిర్వహించారు. అందులో భాగంగా 58 రకాల ఐదువేల విలువగల టెస్టులను కేవలం 999కి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ ఆసుపత్రి డాక్టర్ శ్రీకర్, ఆర్కే ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ రాజ్ కుమార్లు మాట్లాడుతూ ప్రజలు రోగాల పట్ల చాలా జాగ్రత్త వహించాలని అన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే వివిధ రకాల టెస్టులను కేవలం 999 కీ అతి తక్కువ ఖర్చుతో నిర్వహించడం జరిగిందని అన్నారు. మానవ శరీరంలోని ప్రతి అవయవం ముఖ్యమేనని, సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీరామ హాస్పిటల్ లో ఇకనుంచి 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వైద్య నిపుణులు డాక్టర్ స్వామిరావు, డాక్టర్ రాజేష్, శ్రీరామ హాస్పిటల్ నిర్వాహకులు నంబి భరణికుమార్, ముష్కే శ్రీనివాస్, శరత్ మాక్స్ విజన్ కో ఆర్డినేటర్ సతీష్, కౌన్సిలర్ ఆస్తమాలజిస్ట్ నవీన్, ఆసుపత్రి సిబ్బంది పూరి, తిరుపతి, దీపిక, సునీత, సతీష్, నిఖిల్, సంధ్య, సాయికృష్ణ తోపాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరానికి చక్కని స్పందన… వైద్యులతో ప్రజలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!