Social 1080×1350 • Multi-page
14-04-2025 BREAKING NEWS 01:44 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ కోర్టులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

హుజురాబాద్ కోర్టులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
IMG-20250414-WA0136

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,ఏప్రిల్ 14: సోమవారం కోర్టు ఆవరణలో అంబేద్కర్ జయంతిని ఎన్నికల అడ్ హాక్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్ హాక్ కమిటీ సభ్యులు నల్ల భూంరెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు యతిపతి అరుణ్, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రమేష్, ఉపాధ్యక్షులు నూతల శ్రీనివాస్, లైబ్రరీ కార్యదర్శి చౌడమల్ల భానుకిరణ్, జూనియర్ ఏక్సిక్యూటివ్ సభ్యులు తునికి రవి, న్యాయవాదులు ముక్కెర రాజు, పుల్ల సత్యనారాయణ, కొత్తూరి రమేష్, బత్తుల తిరుపతి, శివరామకృష్ణ, మొలుగూరి విక్రం, హరిహారన్, వంశీకృష్ణ, వెంకట్, ఎస్ రాము, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న న్యాయవాదులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!