Social 1080×1350 • Multi-page
15-04-2025 BREAKING NEWS 03:38 PM
swarnodayam.com
Telugu Daily News

టీజేఎస్ జిల్లా కన్వీనర్ గా మోరె గణేష్

టీజేఎస్ జిల్లా కన్వీనర్ గా మోరె గణేష్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా కన్వీనర్ గా మోరె గణేష్ ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సోమవారం నియామక పత్రం అందించారు. మోరె గణేష్ శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందినవారు. తాను ప్రస్తుతం టీజేఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వెలుగు నీడ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షునిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా తన నియామకానికి సహకరించిన టీజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కర్రె సతీశ్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
మోరే గణేష్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!