Social 1080×1350 • Multi-page
16-04-2025 BREAKING NEWS 06:52 PM
swarnodayam.com
Telugu Daily News

ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
IMG-20250416-WA0160

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో, తుమ్మనపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తూకం యంత్రాలు, తేమ యంత్రాలు పనితీరును పరిశీలించారు. కల్లాల వద్ద సన్నాలు, దొడ్డు రకం ధాన్యాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని సూచించారు. సేకరించిన వివరాలను, మిల్లింగ్ కు పంపే ధాన్యం వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్దిష్ట తేమ శాతానికి రాగానే ధాన్యం కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కట్టింగు, కోతలు లేకుండా కొనుగోళ్లు జరపాలని అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 48 గంటల్లోగా రైతులకు ధాన్యం డబ్బులు వచ్చేలా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలకు వచ్చే మహిళలకు, ఉపాధి హామీ కూలీలకు ‘ఆరోగ్య మహిళ’ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మెడికల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, తహసీల్దార్ కనకయ్య, ఎంపిడిఓ సునీత, ఏడిఏ సునీత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈఓ సౌమ్య, ధాన్యం కొనుగోలు సెంటర్ల ఇన్చార్జులు రమేష్, వివేక్ ఉన్నారు.

Oplus_131072 కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వివరాలకు సంబంధించిన ఫ్లెక్సీని పరిశీలిస్తున్న కలెక్టర్..
Oplus_131072 ధాన్యం కొనుగోలు కాంటను పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలాసతి
Oplus_131072 ధాన్యం తేమ చూసే యంత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
Oplus_131072 ధాన్యాన్ని వలచి పరిశీలిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్ తదితర అధికారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!