Social 1080×1350 • Multi-page
16-04-2025 BREAKING NEWS 07:19 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా పోషణ జాతర.. – చిన్నారులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఘనంగా పోషణ జాతర.. – చిన్నారులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
IMG-20250416-WA0173

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. పోషణ జాతరలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, చేతుల పరిశుభ్రత, మిషన్ భగీరథ నీటి ప్రాధాన్యత ప్రయోగం వంటివి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన చిన్నారులకు ప్రీస్కూల్ సర్టిఫికెట్లు అందజేశారు. అంగన్వాడీ చిన్నారులు, పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన కూరగాయల సంతను పరిశీలించి వారి నుండి కూరగాయలు కొనుగోలు చేశారు.

సామూహిక సీమంతాలు, అన్నప్రాసన

పోషణ పక్వాడలో భాగంగా పోషణ జాతరను పరిశీలించిన అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. 25 మంది గర్భిణీలకు సీమంతాల కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ్ పక్వాడలో భాగంగా ఈనెల 22 వరకు పపోషకాహార ప్రాధాన్యతను తెలిపే కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను సూచించారు. ఐసిడిఎస్ అధికారుల ఏర్పాటు చర్యలను అభినందించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, మెప్మా పిడి వేణుమాధవ్, డిప్యూటీ డిఎంహెచ్వో చందు, తహసిల్దార్ కనకయ్య, ఎంపీడీవో సునీత, సిడిపిఓ సుగుణ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సూపర్వైజర్లు పద్మ, రాజశ్రీ, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

పోషణ జాతర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇతర అధికారులు..
ప్రీస్కూల్ చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్
Oplus_131072
చిన్నారులు ఏర్పాటు చేసిన కూరగాయల సంతను పరిశీలిస్తున్న కలెక్టర్
సంతను పరిశీలిస్తున్న కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులు..
గర్భిణీలకు సీమంతాలు నిర్వహిస్తున్న కలెక్టర్..
సీమంతల కార్యక్రమంలో పండ్లు, బట్టలు పెడుతున్న అదనపు కలెక్టర్..
సామూహిక సీమంతల కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలతో కలెక్టర్, ఇతర అధికారులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!