Social 1080×1350 • Multi-page
17-04-2025 BREAKING NEWS 04:36 PM
swarnodayam.com
Telugu Daily News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
IMG_20250417_163502

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొత్తం రూ.62,55,000/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. నియోజకవర్గంలోని వీణవంక మండలానికి చెందిన 53 మందికి, హుజురాబాద్ టౌన్ కి సంబంధించిన 35 మందికి, హుజురాబాద్ రూరల్ కు చెందిన 38 మంది, జమ్మికుంట రూరల్ కి 26 మందికి, జమ్మికుంట టౌన్ కి 20 మందికి, కమలాపూర్ మండలానికి చెందిన 47 మందికి చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆపద కాలంలో పేదలకు ఆపన్న హస్తము అందించేందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని తాజా మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!