Social 1080×1350 • Multi-page
17-04-2025 BREAKING NEWS 09:37 PM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..సబ్ డివిజన్ పరిధిలో బ్లాక్ స్పాట్ ప్రదేశాలు గుర్తింపు.. – రోడ్డు ప్రమాదాల రివ్యూ మీటింగ్లో ఏసిపి శ్రీనివాస్ జీ

రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..సబ్ డివిజన్ పరిధిలో బ్లాక్ స్పాట్ ప్రదేశాలు గుర్తింపు.. – రోడ్డు ప్రమాదాల రివ్యూ మీటింగ్లో ఏసిపి శ్రీనివాస్ జీ
IMG_20250417_213405

– డిబిఎల్ వారు రోడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు వహించాలి

– రోడ్డు ప్రమాదాల రివ్యూ మీటింగ్లో ఏసిపి శ్రీనివాస్ జీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ ఆదేశించారు. గురువారం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రోడ్డు ప్రమాదాల రివ్యూ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. సబ్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు. ప్రమాదాలకు కారణమయ్యే ప్రదేశాలలో రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్స్ తో పాటు రోడ్డు ప్రమాద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. డిబిఎల్ కంపెనీ వారు రోడ్డు నిర్మాణం చేస్తున్న సమయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ అవసరమైన ప్రదేశాలలో రంబుల్స్ ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో పాటు బ్లింకర్స్ ను కూడా పెట్టాలని సూచించారు. ప్రతి రోజు పని షెడ్యూల్‌కు సంబంధించి కనీసం 24 గంటల ముందు సంబంధిత ఎస్‌హెచ్‌ఓకి సమాచారం అందించాలని కూడా ఆదేశించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడిపిస్తున్నారా అనే దానిపై, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో తరచుగా తనిఖీలు నిర్వహించాలని డీబీఎల్ అధికారులను ఆదేశించారు. రాత్రి వేళలో ప్రమాదం జరిగే ప్రదేశాలలో స్ట్రీట్ లైట్ల ఏర్పాటు కూడా చేసేలా కృషి చేస్తామన్నారు. అలాగే హైవే అధికారులతో మెరుగైన సమన్వయం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ శాఖ, హైవే అథారిటీ, డిబిఎల్ కంపెనీతో పాటు వివిధ విభాగాలతో సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ రివ్యూ మీటింగ్లో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సిఐలు వరగంటి రవి, కిషోర్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, హైవే అథారిటీ అధికారులతో పాటు డిబిఎల్ అధికారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
రోడ్డు ప్రమాదాల రివ్యూ మీటింగ్లో మాట్లాడుతున్న ఏసిపి శ్రీనివాస్ జీ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!