19-04-2025 NORMAL NEWS 05:26 PM
swarnodayam.com
Telugu Daily News
19-04-2025 05:26 PM By Mandala Yadagiri

స్వచ్ఛ హుజురాబాద్ గా మార్చాలి…- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

స్వచ్ఛ హుజురాబాద్ గా మార్చాలి…- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20250419-WA0120

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ హుజురాబాద్ గా మార్చాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. శనివారం హుజరాబాద్ లోని సాయి రూప గార్డెన్లో ఏర్పాటుచేసిన స్వచ్ఛ ఎక్సిబిషన్ కార్యక్రమంలో మాట్లాడారు. హుజరాబాద్ లోని 30 వార్డులను అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛ హుజురాబాద్ కోసం సహకరించాలని అన్నారు. చెత్తను సాధ్యమైనంతవరకు బయట వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అప్పగించి తమ పరిసరాలతో పాటు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అధికారులు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. అనంతరం పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థుల సైన్ స్క్వేర్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మాజీ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, ఎంవిఐ కంచే వేణు, ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, అధికారులు కిషన్ రావు, అనిత, అశ్విని గాంధీ, రాజు, రమేష్, అనిల్, కుమార్, సుధీర్, ఫైర్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులతో పాటు పాఠశాలల విద్యార్థులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

వివిధ ప్రదర్శనలు, స్టాళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!