Social 1080×1350 • Multi-page
20-04-2025 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 20: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడామైదానంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన హాకీ క్లబ్ అధ్యక్షడు తోట రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొడిగె తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ సెక్రటరీ జి ఉమామహేశ్వర్ ని, లారీ అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా ఎన్నికైన ఎండి సజ్జుని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ లో హాకీ క్రీడకు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. హుజురాబాద్ లో గత 60 సంవత్సరాలుగా హాకీకి హుజురాబాద్ పెట్టింది పేరు అని అన్నారు. ఎంతోమంది క్రీడాకారులు రాజకీయంగా, ఉద్యోగంలో ఈ హాకీ నుండి స్థిరపడిన వారు ఉన్నారని అన్నారు. రాబోయే తరాలకు కూడా హాకీని పరిచయం చేసి వారిని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు మేము కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భూసారపూ శంకర్, యేముల రవికుమార్, ఆరెల్లి రమేష్, ఎండి యూసుఫ్, సహాయ కార్యదర్శి సాదుల శ్యాం, సిహెచ్ రాజు, రాజేష్, కే రాజేష్, ఎస్ విక్రమ్, ఏం విక్రమ్, సాంబరాజు, పరబ్రహ్మంతో పాటు హాకీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

అధ్యక్షడు తోట రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొడిగె తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ సెక్రటరీ జి ఉమామహేశ్వర్ ని, లారీ అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా ఎన్నికైన ఎండి సజ్జుని క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తున్న దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!