20-04-2025 NORMAL NEWS 08:45 PM
swarnodayam.com
Telugu Daily News
20-04-2025 08:45 PM By Mandala Yadagiri

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. – 31ఏళ్ల తర్వాత జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కలయిక

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. – 31ఏళ్ల తర్వాత జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కలయిక
IMG-20250420-WA0169(1)

పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయిన విద్యార్థులు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ఆనాటి విద్యార్థులు నాడు తాము చదువుకున్న పాఠశాలను చూసి తీపిగుర్తులను నెమరు వేసుకున్నారు. సుమారు 31 సంవత్సరాల తరువాత వారంతా కలిసి తమ ఉపాధ్యాయులను, తోటి మిత్రులను కలుసుకొని సందడి చేశారు. చెల్పూర్ జడ్పీహెచ్ఎస్ 1993-94 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు విద్యార్థులు… ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాలు చేసి, ఆట పాటలతో రోజంతా సరదాగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువుల సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పూర్వ ఉపాధ్యాయులు కాల్వ జనార్దన్ రెడ్డి, చంద్రయ్య, సీతారామయ్య, రాజేందరప్రసాద్, మల్లారెడ్డి, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఒకే చోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు..

Oplus_131072
పూర్వ విద్యార్థులను సత్కరిస్తున్న నాటి ఉపాధ్యాయులు..
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!